చై, సామ్ విషయంలో ఒక్కటైన టాలీవుడ్

చై, సామ్ విషయంలో ఒక్కటైన టాలీవుడ్

Published on Oct 3, 2024 9:06 AM IST

ఒకప్పుడు మన టాలీవుడ్ లో మూవీ లవర్స్ ఎంతో ఇష్టపడే స్టార్ కపుల్స్ లో అక్కినేని నాగ చైతన్య అలాగే సమంతల జంట కూడా ఒకటి. అయితే పలు కారణాలు చేత ఈ ఇద్దరు తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి వేరయ్యి కొత్త జీవితాలు స్టార్ట్ చేసి వారి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే ఇన్నేళ్లు అంతా సజావుగానే ఉంది.

కానీ తాజాగా తెలంగాణాకి చెందిన ఓ మహిళా రాజకీయ నాయకురాలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. చైతు, సామ్ లపై చేసిన పలు అనుచిత వ్యాఖ్యలు షాకింగ్ గా మారి ఇండస్ట్రీలో చర్చకు దారి తీశాయి. అయితే ఈ కామెంట్స్ పై అక్కినేని కుటుంబం సహా టాలీవుడ్ సినీ ప్రముఖులు వెంటనే స్పందించి ఖండించడం గమనార్హం.

మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నాచురల్ స్టార్ నాని నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరకు ఇలా సామ్, చైతుతో వర్క్ చేసిన వారు చేయని వారు కూడా టాలీవుడ్ నుంచి దాదాపు సినీ ప్రముఖులు స్పందించడం విశేషం. దీనితో మన ఇండస్ట్రీ వారి పట్ల వారి పర్శనల్ లైఫ్ కి వారి గౌరవ మర్యాదలకి భంగం కలిగితే ఇతర నటీనటుల నుంచి రియాక్షన్ ఇలానే ఉంటుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు