Devara: తెలుగు స్టేట్స్ లో “దేవర” 6 రోజుల్లో 100 కోట్ల షేర్.. టోటల్ వసూళ్లు

Devara: తెలుగు స్టేట్స్ లో “దేవర” 6 రోజుల్లో 100 కోట్ల షేర్.. టోటల్ వసూళ్లు

Published on Oct 3, 2024 12:02 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ చాలా కాలం తర్వాత తర్వాత తారక్ నుంచి వచ్చిన సినిమా కావడంతో భారీ హైప్ దీనిపై సెట్ అయ్యింది. ఇలా గ్రాండ్ గా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు నంబర్స్ సెట్ చేసి దుమ్ము లేపింది. మరి ఈ సినిమా 6 రోజుల వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా చూస్తే.. పిఆర్ నంబర్స్ ప్రకారం లెక్కలు ఇలా ఉన్నాయి..

డే 6

నైజాం – 3.71 కోట్లు
సీడెడ్ – 1.63
వైజాగ్ – 0.98
తూర్పు గోదావరి – 0.42
వెస్ట్ గోదావరి – 0.33
కృష్ణ – 0.49
గుంటూరు – 0.46
నెల్లూరు – 0.37

నాల్గవ రోజు మొత్తం – 8.39 కోట్ల షేర్ (జిఎస్టి కాకుండా) ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. హాలిడే ప్రభావంతో దేవర వసూళ్లు మరింత పెరిగాయి.

ఇక మొత్తం 6 రోజుల వసూళ్లు చూస్తే

నైజాం – 41.46 కోట్లు
సీడెడ్- 22.26 కోట్లు
వైజాగ్ – 11.19 కోట్లు
తూర్పు గోదావరి – 6.88 కోట్లు
వెస్ట్ గోదావరి- 5.48 కోట్లు
కృష్ణ- 6.28 కోట్లు
గుంటూరు – 9.19 కోట్లు
నెల్లూరు – 4.29 కోట్లు

ఇలా మొత్తం ఆరు రోజుల్లో 107.03 కోట్ల రూపాయల షేర్ ని (జీఎస్టీ కాకుండా) దేవర అందుకుంది. మరి యున్న గాంధీ జయంతి హాలిడే బిగ్ ప్లస్ కూడా కావడంతో దేవర డబుల్ వసూళ్లు సాధించి ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే భారీ మొత్తం 100 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసేసి దుమ్ము లేపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు