వరల్డ్ వైడ్ “దేవర” లేటెస్ట్ వసూళ్లు ఎంతంటే.!

వరల్డ్ వైడ్ “దేవర” లేటెస్ట్ వసూళ్లు ఎంతంటే.!

Published on Oct 3, 2024 1:04 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో చేసిన రెండో సినిమానే “దేవర”. మరి తారక్ గ్లోబల్ హిట్ RRR తర్వాత చేసిన స్ట్రెయిట్ సినిమా ఇది కాగా దీనికి భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. మరి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లోనే 300 కోట్ల మార్క్ ని క్రాస్ చేయగా ఇప్పుడు దేవర 400 కోట్ల మార్క్ కి అతి చేరువలోకి వచ్చేసింది.

మరి మేకర్స్ అనౌన్స్ చేసిన నెంబర్ చూస్తే దేవర మొత్తం 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 396 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా రివీల్ చేశారు. దీనితో దేవర డే 7 తో సెన్సేషనల్ మార్క్ 400 కోట్ల క్లబ్ లో జాయిన్ కాబోతుంది అని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే స్టడీగా దేవర దూసుకెళ్తుండగా లాంగ్ రన్ లో 500 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యినా ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ తదితరులు నటించగా అనిరుద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు