ఇంటర్వ్యూ: టీజీ విశ్వప్రసాద్ – ‘స్వాగ్’లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ కూడా!

ఇంటర్వ్యూ: టీజీ విశ్వప్రసాద్ – ‘స్వాగ్’లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ కూడా!

Published on Oct 3, 2024 8:44 PM IST

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్‌కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘స్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. స్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

 

‘స్వాగ్’ ఎలాంటి కథ?
శ్రీవిష్ణు గారు అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్స్ అలాగే కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. ‘స్వాగ్’ లో ఎంటర్ టైన్మెంట్ తో పాటు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ హైలెట్ గా వుంటాయి. మొత్తం నాలుగు క్యారెక్టర్స్ చేస్తున్నారు. దాదాపు తొమ్మిది గెటప్స్ లో ఆయన్ని ఆడియన్స్ చూడబోతున్నారు. ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎక్స్‌ట్రార్డినరీ ఎమోషనల్ మెసేజ్ ఉంటుంది.

 

డైరెక్టర్ హసిత్ గోలి గురించి?
హసిత్ గోలికి ఎక్స్‌ట్రార్డినరీ రైటింగ్ స్కిల్ ఉంది. ఆయన ఎంటర్‌టైన్మెంట్‌ని చాలా ఈజీగా రాస్తారు. స్వాగ్‌లో ఎమోషనల్ మెసేజ్ ఉన్న కంటెంట్ చేశారు. ఇలాంటి కథలు చాలా రేర్‌గా వస్తాయి. ఇందులో సాలిడ్ మెసేజ్ ఉంటుంది. జనరేషన్స్‌లో మారుతూ వస్తున్న జెండర్ డామినెన్స్ ఇందులో చాలా ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు హసిత్.

 

ఇది నాలుగు తరాల కథ కదా.. ఎలాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది?
డైరెక్టర్ ఈ కథని అందరికీ అర్ధమయ్యే స్క్రీన్ ప్లే తో డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసే విధానం చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ వరకూ థ్రిల్ అండ్ సర్‌ప్రైజ్ ఫ్యాక్టర్ కంటిన్యూ అవుతుంది. మెయిన్ స్టొరీ రివిల్ అయిన తర్వాత ఇంటర్వెల్ నుంచి చాలా మంచి ఎమోషన్ ఉంటుంది.

 

స్వాగ్ సినిమా విషయంలో మీకు ఛాలెంజ్ గా అనిపించిన అంశం ఏమిటి?
ప్రొడక్షన్ సైడ్ ఎలాంటి ఛాలెంజ్ లేదండి. క్రియేటివ్ సైడ్ మాత్రం ఛాలెంజే. ఈ సబ్జెక్ట్ ని 2 గంటల 36 నిమిషాల్లో చెప్పడం అనేది టఫ్ జాబ్. అన్ని క్యారెక్టర్స్ ని డైరెక్టర్ చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసి ఎంగేజింగ్‌గా చెప్పారు.

 

మీరా జాస్మిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
ఇందులో రెండు భవభూతి పాత్రలు ఉంటాయి. కరెంట్ జనరేషన్ క్యారెక్టర్‌కి ఆమె వైఫ్ గా కనిపిస్తారు, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్‌లో చాలా మంచి ఎమోషన్ ఉంటుంది.

 

వెబ్ ప్రాజెక్ట్స్ గురించి?
‘హరికథ’ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది హాట్ స్టార్‌లో రాబోతోంది. అలాగే న్యూసెన్స్ 2 చేస్తున్నాం. మరిన్ని వెబ్ సిరిస్‌లు చేయాలనే ప్లానింగ్స్ ఉన్నాయి.

 

రాజాసాబ్ షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది?
నవంబర్‌లో షూటింగ్ ఫినిష్ చేయాలని భావిస్తున్నాం.

 

ఆడియన్స్ ‘స్వాగ్’ నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ ఆశించవచ్చు?
ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైనింగ్ విత్ లాట్ అఫ్ సస్పెన్స్, క్యురియాసిటీ. సెకండ్ హాఫ్ డిఫరెంట్ ఎమోషన్. సినిమా చూసి బయటికి వచ్చినప్పుడు ఆడియన్స్ వెరీ న్యూ ఎక్స్‌పీరియన్స్ ని ఫీల్ అవుతారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు