“మా నాన్న సూపర్ హీరో” కోసం సూపర్ స్టార్

“మా నాన్న సూపర్ హీరో” కోసం సూపర్ స్టార్

Published on Oct 5, 2024 11:04 AM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన రీసెంట్ చిత్రమే “మా నాన్న సూపర్ హీరో”. దీని కంటే ముందే తాను నటించిన చిత్రం “హరోం హర” యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తే ఈసారి సుధీర్ బాబు పూర్తి ఎమోషనల్ క్లాస్ డ్రామాతో రాబోతున్నాడు. మరి ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా మేకర్స్ ఈరోజు ట్రైలర్ లాంచ్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఈ ట్రైలర్ లాంఛ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని దింపుతున్నారు. మరి ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఇది వరకు వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ చిత్రానికి అభిలాష్ కంకర దర్శకత్వం వహించగా జై క్రిష్ సంగీతం అందించారు. అలాగే వి సెల్యులాడ్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ అక్టోబర్ 11న దసరా కానుకగా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు