జపాన్లో కూడా ‘రా మచ్చా మచ్చా’ హవా

జపాన్లో కూడా ‘రా మచ్చా మచ్చా’ హవా

Published on Oct 5, 2024 3:02 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ నుంచి వస్తున్నా అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కూడా ఒకటి. మరి ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్స్ లో ఇప్పుడు రా మచ్చా మచ్చా అదరగొడుతుంది.

మరి ఆఫ్ లైన్ లో ఆడియెన్స్ కి బాగా ఎక్కేసిన ఈ సాంగ్ ఇపుడు లోకల్ టు గ్లోబల్ కి వెళుతుంది అని చెప్పాలి. రామ్ చరణ్ కి జపాన్ లో కూడా సాలిడ్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి మరోసారి జపాన్ ఫ్యాన్స్ చరణ్ పై ప్రేమ చూపిస్తున్నారు. రా మచ్చా సాంగ్ కి జపాన్ నుంచి లేడీ ఫ్యాన్ స్టెప్పేసి అదరగొట్టింది.

దీనితో గేమ్ ఛేంజర్ సోషల్ మీడియా యూనిట్ కూడా తమ ఎగ్జైట్మెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ మాస్ సాంగ్ తాలుకా హవా బాగానే కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు