వరుస లీక్స్ తో నాని “హిట్” సినిమా!?

వరుస లీక్స్ తో నాని “హిట్” సినిమా!?

Published on Oct 5, 2024 8:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ సాలిడ్ హిట్ చిత్రం “సరిపోదా శనివారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత నాని నుంచి మరిన్ని సోలిన్ ప్రాజెక్ట్ లు రాబోతుండగా తన ఫ్యాన్స్ మరింత ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈ లైనప్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలనుతో నాని చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “హిట్ 3” కూడా ఒకటి. తన ప్రొడక్షన్ లోనే స్టార్ట్ అయ్యిన ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ఇప్పుడు పార్ట్ 3 కి నాని హీరోగా వచ్చింది.

మరి ఈ సినిమా నుంచి ఇప్పుడు వరుస లీక్స్ ఫ్యాన్స్ కి ఇబ్బందిగా మారాయి. సినిమాపై ఉన్న హైప్ ని ఈ లీక్స్ కిల్ చేస్తున్నాయని వారు అంటున్నారు. అలాగే ఇప్పటికే రెండు సార్లు కొన్ని వీడియో క్లిప్స్ లీక్ కాగా నేడు మరో క్లిప్ లీక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి మేకర్స్ ఈ విషయంలో జాగ్రత్త వహించాలి మరి. ఇక ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు