ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

Published on Oct 6, 2024 8:00 AM IST

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘దేవర’ సినిమా మొత్తానికి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. టాక్ ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మాత్రం భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రధానంగా ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఐతే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు ఆడియన్స్ లో కొందరు సినిమాని చూసే ముందే చాలా క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని థియేటర్ కి వెళ్తున్నారు’ అని తారక్ అన్నారు.

ఎన్టీఆర్ ఇంకా మాట్లాడుతూ.. ‘బేసిక్ గా నేనే కాదు, చాలామంది ఫస్ట్ అసలు ఏమీ తెలుసుకోకుండానే సినిమా బాలేదట అని అనేయడం బాగా అలవాటు అయిపోయింది. చాలా నెగిటివ్ అయిపోయాం. అలా కాకుండా ఓపెన్ గా ఒక సినిమాని సినిమాలా చూస్తేనే ఆ సినిమాని కరెక్ట్ గా ఎంజాయ్ చేయగలం’ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. కాగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇక సినిమా విషయానికి వస్తే.. రెండు పాత్రల్లో ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించాడు. ద్విపాత్రాభినయంలో తారక్ అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచింది. సినిమా పై కొందరు నెగిటివ్ ప్రచారం చేసినా.. సినిమాకి మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు