‘విశ్వం’లో ఎన్నో సీక్రెట్స్‌ ఉన్నాయి – శ్రీను వైట్ల

‘విశ్వం’లో ఎన్నో సీక్రెట్స్‌ ఉన్నాయి – శ్రీను వైట్ల

Published on Oct 6, 2024 12:00 PM IST

దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘విశ్వం’. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, తాజాగా శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘విశ్వం’ సినిమా గురించి ఆయన ఏం చెప్పారంటే.. ఈ విశ్వం సినిమాలో నా మార్క్‌ వినోదాన్ని అందిస్తూనే.. గోపీచంద్‌ శైలి యాక్షన్‌ను అందించడం కోసం దాదాపు 8నెలల సమయం తీసుకున్నాను. అన్నీ పక్కాగా కుదిరాయి. ఇక గోపీచంద్‌ పాత్రలో చాలా కోణాలుంటాయి. అవేంటన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. కథకు తగ్గట్లుగానే టైటిల్‌ పెట్టాం. విశ్వంలో ఎన్నో రహస్యాలు ఉన్నట్లుగానే మా చిత్రంలో ఎన్నో సీక్రెట్స్‌ ఉన్నాయి’ అని శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు.

శ్రీను వైట్ల ఇంకా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ‘వెంకీ’ తరహా ట్రైన్‌ సీక్వెన్స్‌ పెట్టాం. ఐతే, ‘వెంకీ’లో ట్రైన్‌ ఎపిసోడ్‌ హిట్టయ్యిందని, ఈ సినిమాలో కూడా అలాంటి ట్రాక్‌ ను బలవంతంగా ఏమీ ఇరికించలేదు. కథలో భాగంగా ఒక ట్రావెల్‌ ఎపిసోడ్‌ ఉంటుంది. ఐతే, ‘వెంకీ’ ట్రైన్‌ ఎపిసోడ్‌ కంటే.. ఈ ఎపిసోడ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్‌ను ఇటలీ, రోమ్, గోవా తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాం. అవి చాలా సహజంగా ఉంటాయి. ప్రేక్షకుల్ని అలరిస్తాయి’ అంటూ శ్రీను వైట్ల తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు