Panjaa: “పంజా” రీరిలీజ్ పై క్రేజీ అప్డేట్..

Panjaa: “పంజా” రీరిలీజ్ పై క్రేజీ అప్డేట్..

Published on Oct 6, 2024 3:30 PM IST

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో పలు హిట్స్ తో పాటుగా ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ ప్లాప్ చిత్రాల్లో కూడా సాలిడ్ క్రేజ్ ఉన్న సినిమాలూ ఉన్నాయి. వాటిలో పవన్ కెరీర్ లోనే మోస్ట్ స్టైలిష్ యాక్షన్ చిత్రం “పంజా” కూడా ఒకటి. దర్శకుడు విష్ణు వర్ధన్ తో చేసిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ని అప్పట్లోనే సాధించింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గానే నిలిచింది.

అయితే ఈ సినిమాకి కూడా నెమ్మదిగా ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అలా ఈ సినిమా కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రీరిలీజ్ కోసం నిర్మాత నీలిమ తిరుమల శెట్టి సాలిడ్ హింట్ ని అందించారు. నిన్న రాత్రి ఓ పార్టీలో తాను పాల్గొనగా అక్కడ బ్యాండ్ పంజా సాంగ్ ని ఆలపించడం జరిగింది.

మరి ఈ వైబ్స్ తో లేటెస్ట్ గా పంజా రీ రిలీజ్ ప్లాన్ చేద్దాం అన్నట్టుగా హింట్ ఇచ్చారు. దీనితో పవన్ అభిమానులు బాగా ఎగ్జైట్ అవుతున్నారు. నార్మల్ టైం లో కాకుండా పవన్ బర్త్ డే కానుకగా వచ్చే ఏడాదికి గ్రాండ్ గా ప్లాన్ చెయ్యాలని కోరుతున్నారు. మరి ఈ క్రేజీ స్టైలిష్ యాక్షన్ డ్రామా ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు