“మా నాన్న సూపర్ హీరో” మేకర్స్ సాలిడ్ కాన్ఫిడెన్స్

“మా నాన్న సూపర్ హీరో” మేకర్స్ సాలిడ్ కాన్ఫిడెన్స్

Published on Oct 6, 2024 5:01 PM IST

టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మా నాన్న సూపర్ హీరో” కోసం తెలిసిందే. దీనికి ముందు యాక్షన్ చిత్రం “హరోం హర” తో ఈ ఏడాది ఆల్రెడీ తాను పలకరించగా దీని తర్వాత పూర్తిగా క్లాస్ సినిమాతో తాను వస్తున్నాడు. మరి సినిమా సినిమాకి తనని మౌల్డ్ చేసుకుంటున్న సుధీర్ బాబు అండ్ టీం ఇపుడు మా నాన్న సూపర్ హీరో సినిమా విషయంలో ధీమాగా ఉన్నారట.

అందుకే సినిమా రిలీజ్ కంటే ముందే రెండు రోజులు మునుపు పైడ్ ప్రీమియర్స్ ని వేసే ప్లానింగ్స్ లో ఉన్నారట. ఈ అక్టోబర్ 11న సినిమా రిలీజ్ కాగా రెండు రోజులు ముందే తెలుగు స్టేట్స్ లో కొన్ని చోట్ల పైడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేస్తున్నారట. దీని బట్టి సినిమా విషయంలో మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అభిలాష్ కంకర దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ వి సెల్యులాయిడ్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు