అప్పుడు కారులోనే బట్టలు మార్చుకున్నా – విద్యాబాలన్

అప్పుడు కారులోనే బట్టలు మార్చుకున్నా – విద్యాబాలన్

Published on Oct 7, 2024 9:03 AM IST

బాలీవుడ్ లో విద్యాబాలన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన ‘కహానీ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 2012లో విడుదలైంది. కోల్‌కతా మెట్రోలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి 15 కోట్ల బడ్జెట్ అయింది. అయితే, ఈ సినిమా మాత్రం 79 కోట్లు రాబట్టింది. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో విద్యాబాలన్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.

కహానీ బడ్జెట్ కారణంగా వ్యానిటీ వ్యాన్ ను పెట్టలేదట. దీంతో, రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులోనే విద్యాబాలన్ బట్టలు మార్చుకోవాల్సి వచ్చిందట. ఇదే విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘కహాని సినిమా షూటింగ్ లో నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. ఆ షూటింగ్ లో ఎలాంటి వ్యానిటీ వ్యాన్‌ లేదు. పైగా సినిమాకి పెద్ద బడ్జెట్ కూడా లేదు. దీంతో, సెట్స్ లో నేను బట్టలు మార్చుకోవలసి వచ్చినప్పుడల్లా.. ఇన్నోవా కారు కిటికీకి నల్లటి గుడ్డ చుట్టి.. ఆ కారులో బట్టలు మార్చుకున్నాను’ అంటూ ఆమె తెలిపింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు