ఆ దర్శకుడికి విలువైన కానుక

ఆ దర్శకుడికి విలువైన కానుక

Published on Oct 7, 2024 1:00 PM IST

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన 50వ చిత్రం మహారాజ. ఈ తమిళ సినిమా తెలుగు నాట కూడా దుమ్ము లేపింది. మొత్తానికి మంచి విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమాకి నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. అందుకే, ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ‘మహారాజ’ 100 డేస్‌ సెలబ్రేషన్స్‌ ఘనంగా జరిగాయి. చెన్నైలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మహారాజ టీమ్ పాల్గొంది.

కాగా ఈ వేడుకల్లో చిత్రబృందం దర్శకుడు నిథిలన్‌ స్వామినాథన్‌ కి సర్‌ ప్రైజ్‌ ఇచ్చింది. హీరో విజయ్ సేతుపతి నిర్మాతతో కలిసి తమ సినిమా దర్శకుడికి బీఎండబ్ల్యూ కారును కానుకగా అందించారు, దీనికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అన్నట్టు ఈ వేడుకల్లో మరో హీరో జయం రవి కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయం రవి మాట్లాడుతూ.. విజయ్‌ సేతుపతి యాక్టింగ్‌ ప్రేక్షకుల మది దోచుకుందని, విజయ్‌ సేతుపతి యాక్టింగ్‌ను కొనియాడారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు