ఇంటర్వ్యూ: సుధీర్ బాబు – ‘మా నాన్న సూపర్ హీరో’ అందరూ రిలేట్ చేసుకుంటారు!

ఇంటర్వ్యూ: సుధీర్ బాబు – ‘మా నాన్న సూపర్ హీరో’ అందరూ రిలేట్ చేసుకుంటారు!

Published on Oct 7, 2024 7:09 PM IST

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

తండ్రీ-కొడుకు ఎమోషన్ యూనివర్సల్ కదా.. ఈ సినిమాలో ఆ ఎమోషన్ చూపించడానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు?
మా నాన్న సూపర్ హీరో కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగా సెట్ అయింది. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు చుట్టూ తిరిగే కథ ఇది. తండ్రిని చూసుకోవడానికి కొడుకు పడే తపనలో చాలా కొత్త సిచువేషన్స్ ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ అయ్యాయి. ఫాదర్ సన్ ఎమోషన్ ఆల్రెడీ ఉంది. అది జనాలకి గుర్తు చేస్తే చాలు. నాన్నని ప్రేమిస్తున్న కథ చెబుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్స్, కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ లోనే ఎస్టాబ్లిష్ అవుతాయి. దీన్ని ఇద్దరు ఫాదర్స్, ఒక కొడుకు మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇది యూనివర్సల్ పాయింట్. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను.

ట్రైలర్ లోనే దాదాపుగా కథని రివిల్ చేయడం గురించి?
ఇది థ్రిల్లర్ కాదు. తొలి రెండు సీన్స్‌లోనే కథ ఏమిటనేది ఆడియన్స్‌కి క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఆ సిచువేషన్స్ ఎప్పుడు వస్తాయి, అవి వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. హ్యూమన్ రిలేషన్స్ మీద ఉన్న పాయింట్ ఇది. ఇది ఎలాంటి సినిమా, ఆడియన్స్ సినిమా నుంచి ఏమి ఆశించవచ్చు అనేది క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాం.

ఇందులో రియల్ లైఫ్ ని గుర్తు తెచ్చిన మూమెంట్స్ ఏమిటి?
ఇందులో దాదాపు అన్ని సీన్స్ నన్ను ఇమోట్ చేశాయి. ఇందులో హీరో తండ్రిని విపరీతంగా ప్రేమిస్తాడు. ఈ ఎమోషన్ నేచురల్‌గా నా నుంచి వచ్చింది. మన అందరికీ సూపర్ హీరో నాన్నే. ఇందులో ఓవర్ ది బోర్డ్ పెర్ఫార్మెన్స్ లు చేయకూడదని అనుకున్నాం. కెమరా మూమెంట్స్ కూడా చాలా సహజంగా ఉంటాయి.

‘మా నాన్న సూపర్ హీరో’ ఎలా స్టార్ట్ అయ్యింది?
అభిలాష్ చేసిన ‘లూజర్’ సిరిస్ చూశాను. అభిలాష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఫాదర్ ఎమోషన్ పై చాలా సినిమాలు వచ్చాయి. అయితే కంప్లీట్ ఫాదర్ ఎమోషన్ ఉన్న సినిమాలు రేర్. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు కథ ఇంతముందు ఎప్పుడూ రాలేదు. ఫాదర్ పై ప్రేమని ‘యానిమల్’లో అగ్రెసివ్ అండ్ బోల్డ్ గా లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ లా చూపించారు. అది జనాలకి నచ్చింది. మా నాన్న సూపర్ హీరోలో నాన్నమీద ఉన్న ప్రేమని ప్రేమతో ప్రాజెక్ట్ చేస్తున్నాం.

నిర్మాతల గురించి?
యూవీ క్రియేషన్స్ నా ఫ్రెండ్స్. విక్కీ, వంశీ, సునీల్ మేమంతా కలిసి 2002లో సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఆర్య నుంచి నాలుగైదు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాం. తర్వాత వాళ్లు కంటిన్యూ చేశారు. క్వాలిటీ పరంగా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చేసే ప్రొడ్యూసర్స్. డైరెక్టర్ కి చాలా ఫ్రీడమ్ ఇస్తారు. 100% హిట్ కొడతామని కాన్ఫిడెన్స్ ఉంది.

మహేష్ బాబు గారు ట్రైలర్ రిలీజ్ చేశారు కదా.. ఆయన రియాక్షన్ ఏంటి?
మహేష్ గారికి మొదట రఫ్ కట్ పంపించాను. చూసి లుకింగ్ గుడ్ అన్నారు. ఫైనల్ ట్రైలర్ పంపించిన తర్వాత.. చూసి చాలా అప్రిషియేట్ చేశారు. హార్ట్ టచ్చింగ్ అన్నారు. లాస్ట్ లో వచ్చే ‘మహేష్ బాబు పేరు’ ఉన్న డైలాగ్ గురించి ప్రస్తావిస్తూ చాలా ఫన్నీగా ఉందని అన్నారు.

సాయి చంద్, సాయాజీ షిండే గారి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది.?
ఇద్దరూ ఫెంటాస్టిక్ యాక్టర్స్. సాయాజీ షిండే గారు ఇప్పటివరకు ఎప్పుడూ చేయని ఒక ఫ్రెష్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆడియన్స్ కి ఆయన క్యారెక్టర్ రిఫ్రెష్మెంట్. సాయి చంద్ గారు ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయన ఎమోషనల్ క్యారెక్టర్స్ ని చాలా అద్భుతంగా చేస్తారు.

జైక్రిష్ మ్యూజిక్ గురించి?
చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తను చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. దానికి మించిన పేరు ఈ సినిమాతో వస్తుంది. పాటలు, బీజీఎం అన్నిటికి మంచి పేరు వస్తుంది.

కొత్తగా చేయబోతున్న సినిమాలు గురించి?
‘జటాధరా’ కాన్సెప్ట్ పరంగా వెరీ బిగ్ స్కేల్ మూవీ. ప్రీప్రొడక్షన్ జరుగుతోంది. అలాగే రాహుల్ రవీంద్రన్ తో ఓ సినిమా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు