‘స్వాగ్’లో సర్‌ప్రైజ్ రోల్ రివీల్.. స్పెషల్ అంటోన్న శ్రీ విష్ణు

‘స్వాగ్’లో సర్‌ప్రైజ్ రోల్ రివీల్.. స్పెషల్ అంటోన్న శ్రీ విష్ణు

Published on Oct 7, 2024 9:33 PM IST

కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘స్వాగ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేయగా వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు చేసిన పాత్రలు, ఆయన వేసిన గెటప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అయితే, ఈ సినిమాలో శ్రీ విష్ణు ఓ సర్‌ప్రైజింగ్ పాత్రలో కనిపిస్తారని మేకర్స్ రిలీజ్‌కి ముందే చెప్పారు. దీంతో ఆ పాత్ర ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ పాత్రను మేకర్స్ అఫీషియల్‌గా రివీల్ చేశారు. ఈ సినిమాలో ‘విభూతి’ అనే పాత్రలో శ్రీ విష్ణు కనిపించాడని, ఈ పాత్రను ఆడియెన్స్ అమితంగా ఇష్టపడ్డారని వారు పేర్కొన్నారు. ఇలా లేడీ గెటప్‌లో శ్రీ విష్ణుని చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు.

ఇక ఈ సినిమాలో రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు