హమ్మయ్య.. ‘సుందరకాండ’ నుంచి మరో అప్డేట్ వచ్చేస్తుంది!

హమ్మయ్య.. ‘సుందరకాండ’ నుంచి మరో అప్డేట్ వచ్చేస్తుంది!

Published on Oct 7, 2024 9:50 PM IST

టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సుందరకాండ’ షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను వెంకటేశ్ నిమ్మలపూడి డైరెక్ట్ చేయగా, ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ మూవీగా రానుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలోని ‘హమ్మయ్య’ అనే రెండో లిరికల్ సాంగ్‌ని అక్టోబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటం అభిమానులను థ్రిల్ చేసింది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో వ్రితి వాఘాని, నరేష్, వాసుకి, సత్య, అజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు