“కంగువా” కోసం ప్రభాస్?

“కంగువా” కోసం ప్రభాస్?

Published on Oct 8, 2024 7:10 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు సెట్ చేసుకొని రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ సౌత్ చిత్రాల్లో కోలీవుడ్ భారీ ప్రాజెక్ట్ “కంగువా” కూడా ఒకటి. మరి దర్శకుడు శివ అలాగే హీరో సూర్య కాంబినేషన్లో చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ ప్రాజెక్ట్ సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది. మరి ఈ సినిమా విడుదలకి సమయం దగ్గరకి వస్తుండగా మేకర్స్ సాలిడ్ ప్లానింగ్స్ కూడా చేస్తున్నారు.

అలా ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ని కూడా దింపే ప్లాన్ లో ఉన్నట్లు ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. మరి వీరికి ప్రభాస్ కి ఉన్న మైత్రి కోసం అందరికీ చెప్పాల్సిన పని లేదు అలా కంగువా ప్రీ రిలీజ్ కోసం డార్లింగ్ హీరో వచ్చే ఛాన్స్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజముందో వేచి చూడాలి. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే దిశా పటాని హీరోయిన్ గా నటించగా స్టూడియో గ్రీన్ వారు కూడా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు