టాక్.. “పుష్ప 2” రిలీజ్ కి చిన్న మార్పు?

టాక్.. “పుష్ప 2” రిలీజ్ కి చిన్న మార్పు?

Published on Oct 8, 2024 8:06 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “పుష్ప 2”. మరి సెన్సేషనల్ హిట్ పుష్ప కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఎనలేని హైప్ నెలకొంది. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అలా వాయిదా పడుతూ వచ్చింది. ఇలా డిసెంబర్ 6కి ఫైనల్ అయ్యిన ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

దీని ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 6న తప్పుకొనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది డిసెంబరు 6న కాకుండా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో దింపే ఛాన్స్ ఉన్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి నిజంగానే పుష్ప 2 ప్రీపోన్ అయ్యిందో లేదో అనే దానిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు