దే’వర’ 2 పై కొరటాల క్రేజీ కామెంట్స్ వైరల్.!

దే’వర’ 2 పై కొరటాల క్రేజీ కామెంట్స్ వైరల్.!

Published on Oct 8, 2024 9:13 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ ని సాధించగా ఇప్పుడు 500 కోట్ల క్లబ్ దిశగా సినిమా దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా మేకర్స్ దే’వర’ 2 ని కంఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా విషయంలో కొరటాల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

పార్ట్ 2 మరింత అద్భుతంగా ఉంటుంది. వైలెన్స్ కూడా ఒకింత ఎక్కువే ఉంటుంది అని తెలిపారు. అలాగే తారక్ రోల్ అయితే పార్ట్ 1 లో కేవలం 10 శాతం మాత్రమే అయితే పార్ట్ 2 లో 100 శాతం క్రేజీ ట్రీట్ అందిస్తుంది అని తెలిపారు. అలాగే చాలా పాత్రలు కీలకంగా కనిపిస్తాయి ఖచ్చితంగా పార్ట్ 2 ఊహించని విధంగా ఉంటుంది నా ప్రామిస్ అంటూ తెలిపారు. దీనితో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు