యూఎస్ మార్కెట్ లో “గేమ్ ఛేంజర్” టార్గెట్ లాక్?

యూఎస్ మార్కెట్ లో “గేమ్ ఛేంజర్” టార్గెట్ లాక్?

Published on Oct 8, 2024 11:01 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేస్తున్న ఈ సాలిడ్ కమర్షియల్ పొలిటికల్ డ్రామా శంకర్ మార్క్ లో మంచి కం బ్యాక్ ఇస్తుంది మేకర్స్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇపుడు వరుస అప్డేట్స్ కూడా వస్తుండగా ప్రస్తుతం “గేమ్ ఛేంజర్” బిజినెస్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం యూఎస్ మార్కెట్ లో గేమ్ ఛేంజర్ టార్గెట్ గా 4.5 మిలియన్ డాలర్స్ టార్గెట్ తో దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది సోలోగా చరణ్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ అని చెప్పాలి. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించారు. అలాగే ఈ క్రిస్మస్ కానుకగా సినిమాని రిలీజ్ కి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు