నైజాంలో “దేవర” 11 రోజుల వసూళ్లు ఎంతంటే!

నైజాంలో “దేవర” 11 రోజుల వసూళ్లు ఎంతంటే!

Published on Oct 8, 2024 12:03 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తన కెరీర్ 30వ సినిమాని దర్శకుడు కొరటాల శివతో రెండో కొలాబరేషన్ లో చేసిన సంగతి తెలిసిందే. మరి ఆ సినిమానే “దేవర” కాగా భారీ హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా మంచి అక్యుపెన్సీతో భారీ వసూళ్లు రాబట్టి లాంగ్ రన్ లో 500 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తుంది.

మరి ఇలా నైజాంలో 11 రోజుల రన్ ని దేవర కంప్లీట్ చేసుకోగా ఈ 11 రోజుల వసూళ్ల డీటెయిల్స్ అయితే ఇపుడు తెలుస్తున్నాయి. డే 11 నైజాం మార్కెట్ లో దేవర 73 లక్షలకి పైగా షేర్ ని రాబట్టినట్టుగా పి ఆర్ లెక్కలు .చెబుతున్నాయి. దీనితో మొత్తం 11 రోజుల్లో ఈ చిత్రం 47.54 కోట్ల షేర్ మార్క్ ని జీఎస్టీ కాకుండా అందుకోవడం విశేషం. దీనితో తారక్ నైజాంలో 50 కోట్ల షేర్ మార్క్ ని సెట్ చేసే విధంగా దూసుకెళ్తున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు