సర్ప్రైజింగ్.. “అజ్ఞాతవాసి” సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో..

సర్ప్రైజింగ్.. “అజ్ఞాతవాసి” సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో..

Published on Oct 8, 2024 2:00 PM IST

టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ప్రస్తుత డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల్లో ఎపిక్ డిజాస్టర్ చిత్రం “అజ్ఞాతవాసి” కూడా ఒకటి. పవన్ అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో దీనిపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కాదు మరి అందుకు తగ్గట్టుగానే సినిమా భారీ ఓపెనింగ్స్ ని కూడా సాదించింది కానీ ఫైనల్ గా ప్లాప్ గానే మిగిలిపోయింది.

అయితే ఈ సినిమా విషయంలో అనిరుద్ ఇచ్చిన ఆల్బమ్ మాత్రం క్లాసిక్ గా నిలిచిపోయిందని చెప్పాలి. అందులో త్రివిక్రమ్, పవన్ మార్క్ మెలోడీ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఊపేసాయి. మరి ఎప్పుడో 2018లో వచ్చిన ఈ సినిమా, సాంగ్స్.. ఇప్పుడు ట్రెండింగ్ లో కనిపించడం సర్ప్రైజింగ్ అని చెప్పాలి.

మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ స్పాటిఫైలో హైదరాబాద్ వరకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు వీక్ టాప్ 10 ట్రెండింగ్ పాటల్లో పలు రీసెంట్ సినిమాల పాటలతో పాటుగా అజ్ఞాతవాసి నుంచి ‘గాలి వాలుగా’ సాంగ్ టాప్ 10 లో నిలిచింది. ఇది మాత్రం సర్ప్రైజింగ్ అని చెప్పాలి. ఎప్పుడు 2018 సినిమా ఇప్పుడికీ శ్రోతల ప్లే లిస్ట్ లో ట్రెండింగ్ లో ఉండేలా రూల్ చేస్తుంది ఈ సాంగ్. కానీ దురదృష్టవశాత్తు సినిమా ప్లాప్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు