“స్పిరిట్” కి ఊహించని లుక్ లో ప్రభాస్?

“స్పిరిట్” కి ఊహించని లుక్ లో ప్రభాస్?

Published on Oct 8, 2024 3:57 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు దర్శకుడు మారుతీ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కూడా పూర్తవుతుంది. అయితే ప్రభాస్ బిజీగా లైఫ్ లో మరిన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాల్లో క్రేజీ ప్రాజెక్ట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో చేయనున్న యాక్షన్ చిత్రం “స్పిరిట్” కూడా ఒకటి. మరి దీనిపై డబుల్ హైప్ కూడా ఉంది. ఇక ఈ సినిమా విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం ప్రభాస్ ఒక ఊహించని లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కోసం ఓ స్పెషల్ లుక్ ని లాక్ చేయగా ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజా సాబ్ తర్వాత ఆ లుక్ లోకి మారనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ లుక్ తోనే ఈ ఒక్క సినిమా కంప్లీట్ చేశాకే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్లనున్నట్టుగా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి మాత్రం ఈ వైలెంట్ కాంబినేషన్ లో సినిమా చాలా జాగ్రత్తగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు