Pushpa 2: ‘పుష్ప-2’ ఫస్ట్ హాఫ్ లాక్.. అలెర్ట్ అంటున్న మేకర్స్!

Pushpa 2: ‘పుష్ప-2’ ఫస్ట్ హాఫ్ లాక్.. అలెర్ట్ అంటున్న మేకర్స్!

Published on Oct 8, 2024 4:58 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ కోసం యావత్ ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ వెల్లడించడంతో, ఈ సినిమా ఫైనల్ ఔట్‌పుట్ విషయంలో మేకర్స్ చాలా కష్టపడుతున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను లాక్ చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలోని ఫస్ట్ హాఫ్‌తో థియేటర్లు తగలబడిపోవాల్సిందేనని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తుఫాను రావడం ఖాయమని వారు అలెర్ట్ చేస్తున్నారు. దీంతో ‘పుష్ప-2’ ఫ్యాన్స్ ఈ మూవీని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించాలని మేకర్స్ చూస్తున్నారు. అల్లు అర్జున్ నటవిశ్వరూపంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేవాల్సిందేనని అభిమానులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. అందాల భామ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు