ఫైనల్ షెడ్యూల్‌లో ‘ఓదెల-2’.. జాయిన్ అయిన తమన్నా!

ఫైనల్ షెడ్యూల్‌లో ‘ఓదెల-2’.. జాయిన్ అయిన తమన్నా!

Published on Oct 8, 2024 6:02 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో ‘ఓదెల 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా సంపత్ నంది ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, బిహైండ్ ది సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

ఓదెల గ్రామంలో ఈ చిత్ర ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో స్టార్ బ్యూటీ తమన్నా జాయిన్ అయ్యింది. ఆమె ఈ సినిమాలో శివశక్తి(నాగ సాధు) పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తోంది. ఇక ఈ షైనల్ షెడ్యూల్‌ని వీలైనంత త్వరగా ముగించేయాలని మేకర్స్ చూస్తున్నారు. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట సింహా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు