2024 లో రికార్డ్ టీఆర్పీ అందుకున్న మహేష్ సినిమా..

2024 లో రికార్డ్ టీఆర్పీ అందుకున్న మహేష్ సినిమా..

Published on Oct 9, 2024 8:05 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గత చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడితో చేసిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా “సరిలేరు నీకెవ్వరు” కూడా ఒకటి. మరి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా క్లాష్ ఉన్నపటికీ రికార్డ్ వసూళ్లు సాధించి దుమ్ము లేపింది. అయితే ఈ సినిమా బిగ్ స్క్రీన్స్ మీదే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమా టెలికాస్ట్ అయ్యిన ప్రతీసారి కూడా సాలిడ్ టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ వస్తూనే ఉంది.

అలా ఈ ఏడాదిలో మన తెలుగు బుల్లితెర దగ్గర రికార్డ్ టీఆర్పీ ఇప్పటికే ఎన్నోసార్లు టెలికాస్ట్ అయిన సినిమాల్లో అందుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి 7.01 రేటింగ్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఇది మాత్రం ఈ ఏడాదిలో రికార్డ్ అన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అయితే మహేష్ బాబు సినిమాలకి స్మాల్ స్క్రీన్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో దీనితో మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని అనీల్ సుంకర నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు