ప్రశాంత్ వర్మ నుంచి ఇంట్రెస్టింగ్ సూపర్ హీరో సినిమా..?ఈసారి వేరే

ప్రశాంత్ వర్మ నుంచి ఇంట్రెస్టింగ్ సూపర్ హీరో సినిమా..?ఈసారి వేరే

Published on Oct 9, 2024 12:09 PM IST

మన తెలుగు సినిమా దగ్గర టచ్ చేసిన అనేక జానర్స్ లో స్ట్రెయిట్ సూపర్ హీరో సినిమా ఏదన్నా ఉంది అంటే అది “హను మాన్” అని చెప్పాలి. సూపర్ హీరో జానర్ కి ఇతిహాసన్ని జోడించి చేసిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యింది. అలాగే ఈ సినిమాని తెలుగు ఆడియెన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కి అందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ మన తెలుగు సినిమా నుంచి మరో కొత్త ప్రయత్నం అందించాడు.

అయితే ఈ సినిమా తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు తను చేస్తుండగా తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఈ అక్టోబర్ 10న మరో అనౌన్స్మెంట్ ని అందిస్తున్నట్టు తెలిపాడు. అయితే ఇది కూడా సూపర్ హీరో సినిమానే అని ఆల్రెడీ టాక్ ఉంది. కానీ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈసారి ఒక ఫీమేల్ సూపర్ హీరో సినిమాని తీసుకురానున్నట్టు తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనేవి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి రేపు వచ్చే అనౌన్స్మెంట్ ఇదేనా కాదా అనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు