Viswam: ‘విశ్వం’ నుండి మాస్ సాంగ్ ప్రోమో.. దుమ్ములేవాల్సిందే!

Viswam: ‘విశ్వం’ నుండి మాస్ సాంగ్ ప్రోమో.. దుమ్ములేవాల్సిందే!

Published on Oct 9, 2024 8:01 PM IST

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ దసరా కానుకగా మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది.

అయితే, ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ కూడా ఉందని.. ఈ పండుగకు అందరూ ఈ పాటతో స్టెప్పులు వేస్తారని గోపీచంద్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన ప్రోమోను కూడా వదిలారు మేకర్స్. ‘గుంగురు గుంగురూ’ అంటే సాగే ఈ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయడం విశేషం. ఇక ఈ పాటకు ఆయన అదిరిపోయే మాస్ ట్యూన్స్ అందించినట్లుగా ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో సందడి చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు