వేట్టయన్ నుంచి మరో ప్రోమో.. రానా వర్సెస్ రజినీ!

వేట్టయన్ నుంచి మరో ప్రోమో.. రానా వర్సెస్ రజినీ!

Published on Oct 9, 2024 10:02 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’ మరికొద్ది గంటల్లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాలో రజినీకాంత్ ఓ పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నాడు. దర్శకుడు జ్ఞాన్‌వేల్ ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందించాడు.

ఇక రిలీజ్‌కి దగ్గరపడటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసి సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మరో ప్రోమోను రిలీజ్ చేయగా, ఇందులో రజినీకాంత్ వర్సె్స్ రానా దగ్గుబాటి సీన్స్ మనకు చూపెట్టారు. వారి మధ్య డైలాగ్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉండటం విశేషం.

ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సాలిడ్ సంగీతాన్ని అందించాడు. మరి ఈ సినిమా రేపు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు