Ratan Tata: ముగిసిన అధ్యాయం.. టైటాన్ రతన్ టాటా ఇక లేరు

Ratan Tata: ముగిసిన అధ్యాయం.. టైటాన్ రతన్ టాటా ఇక లేరు

Published on Oct 10, 2024 12:57 AM IST

భారతదేశ బిజినెస్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి పలువురు దిగ్గజ వ్యాపారవేత్తల్లో లెజెండరీ రతన్ నావళ్ టాటా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఆటో మొబైల్స్, సోప్ వేర్, స్టీల్ ఫ్యాక్టరీస్ ఇలా ఎన్నెన్నో రంగాల్లో రతన్ టాటా అందించిన నాణ్యమైన సేవలు అందరికీ తెలుసు. కానీ వీటికి మించి ఒక మంచి మనిషిగా రతన్ టాటా ఎంతోమంది హృదయాలు గెలుచుకున్నారు.

ఇతర వ్యాపారవేత్తలలా కాకుండా తన సంపాదనలో చాలా మేర నిస్సహాయులకే అందించి ఒక రియల్ హీరో అయ్యారు. అలాగే దేశంలో సామాన్య ప్రజల కోసం కారు ప్రయాణం దగ్గరకి తీసుకురావాలని లక్ష రూపాయల్లోనే కార్ తీసుకొచ్చి సంచలనం సెట్ చేశారు. అంతే కాకుండా ఇండియా లోనే అత్యంత సేఫ్ కార్లని తయారు చేసేది కూడా టాటా గారే అని ఒక నమ్మకాన్ని కూడా వారు గెలుచుకున్నారు.

ఇలా భారతీయుల పట్ల కానీ తన దేశం పట్ల కానీ టాటా గారు ఎప్పుడూ ఎంతో గౌరవంగా నిజాయితీగా ఉంటూ మార్గదర్శకంగా నిలిచారు. మరి ఇలాంటి మహనీయుడు ఇక లేరు అనే వార్తే ఎంతో హృదయ విదారకంగా అనిపిస్తుంది. కానీ నమ్మక తప్పదు వారు ఇక లేరు అంటూ టాటా గ్రూప్ నుంచి వారి వారసులు అధికారికంగా అనౌన్స్ చేశారు.

టాటా గారు తన ఆరోగ్య పరిస్థితులు రీత్యా వారు కాలం చేసినట్టుగా తెలిపారు. దీనితో దేశ వ్యాప్తంగా అనేకమంది రాజకీయ నాయకులూ సినీ ప్రముఖులు కూడా నివాళులు అర్పిస్తున్నారు. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు టీం కూడా ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు