బాలకృష్ణ సూపర్‌హీరో మూవీలో పాన్ ఇండియా స్టార్ బ్యూటీ..?

బాలకృష్ణ సూపర్‌హీరో మూవీలో పాన్ ఇండియా స్టార్ బ్యూటీ..?

Published on Oct 11, 2024 8:04 PM IST

నందమూరి బాలకృష్ణ ఓ సూపర్ హీరో మూవీలో నటించబోతున్నాడనే వార్త నిన్నటి నుండి సినీ సర్కి్ల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య నెవర్ బిఫోర్ పాత్రలో నటిస్తాడని.. ఇది బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని నెట్టింట జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఓ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ కూడా జాయిన్ కాబోతుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలయ్య సూపర్‌హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా జాయిన్ కానుందనే వార్త వినిపిస్తోంది. దీంతో అభిమానులు ఈ కాంబినేషన్ నిజంగా సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రెస్పాన్స్ ఖాయమని అంటున్నారు.

మరి నిజంగానే బాలయ్య సూపర్ హీరో పాత్రలో నటించబోయే ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ నటిస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ రావాలంటే, దసరా రోజున ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు