నార్త్‌లో సూర్య ‘కంగువా’ను రిలీజ్ చేసేది వీరే!

నార్త్‌లో సూర్య ‘కంగువా’ను రిలీజ్ చేసేది వీరే!

Published on Oct 12, 2024 11:39 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ ఎపిక్ మూవీ ‘కంగువా’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తొలుత దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇక ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కించగా పూర్తి ఫాంటెసీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది.

ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని నార్త్ ఇండియాలో ఎవరు రిలీజ్ చేస్తారా అనే ప్రశ్నకు మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. ‘కంగువా’ చిత్రాన్ని నార్త్ ఇండియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పెన్ మూవీస్ రిలీజ్ చేయనుంది. ఆర్ఆర్ఆర్, స్త్రీ-2 వంటి సినిమాలను కూడా ఈ సంస్థ రిలీజ్ చేయడం విశేషం.

ఇక ఈ సినిమాలో సూర్య సరికొత్త అవతారంలో పవర్‌ఫుల్ యాక్షన్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాలో దిశా పటాని, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. నవంబర్ 14న ‘కంగువా’ వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు