“విశ్వంభర” విడుదలపై క్లారిటీ అప్పుడే!

“విశ్వంభర” విడుదలపై క్లారిటీ అప్పుడే!

Published on Oct 13, 2024 7:09 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి నిన్ననే దసరా కానుకగా టీజర్ కూడా వచ్చింది. మరి ఈ టీజర్ లాంచ్ లో మేకర్స్ పలు ఇంట్రెస్టింగ్ అంశాలే వెల్లడించారు. మొదటగా విశ్వంభర ని జనవరిలో ప్లాన్ చేసినప్పటికీ చరణ్ కోసమే తాము వెనక్కి వెళ్లినట్లు క్లారిటీ ఇచ్చేశారు.

అయితే మరి విశ్వంభర విడుదల ఎప్పుడు? అనే ప్రశ్నకు క్లారిటీ కూడా ఇచ్చారు. గేమ్ ఛేంజర్ విడుదల తర్వాతే తమ సినిమా ఎప్పుడు విడుదల ఏంటి అనేది రివీల్ చేస్తామని తెలిపారు. సో వచ్చే ఏడాది సంక్రాంతికి అలా విశ్వంభర విడుదలపై క్లారిటీ రావచ్చని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే మే రిలీజ్ అన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి చూడాలి అంత లేట్ గా విడుదల చేస్తారో లేక త్వరగానే తీసుకొస్తారో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు