Devara: “దేవర”తో తారక రాముడి తాండవం.. 500 కోట్ల క్లబ్ లోకి

Devara: “దేవర”తో తారక రాముడి తాండవం.. 500 కోట్ల క్లబ్ లోకి

Published on Oct 13, 2024 12:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్న తరుణంలో వరల్డ్ వైడ్ మాస్ రిలీజ్ కి ఈ చిత్రం వచ్చింది.

అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ హిట్ టాక్ తెచ్చుకోనప్పటికీ కూడా రికార్డు వసూళ్లు బాక్సాఫీస్ దగ్గర రాబట్టి రేపింది. మరి సోలోగా తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 500 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేసింది.

దీనితో ఎలాంటి రాజమౌళి లేకుండా ప్రభాస్ తో పాటుగా 500 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన మరో హీరోగా తారక్ నిలిచాడు అని చెప్పాలి. మరి ఈ మిక్స్డ్ టాక్ తోనే తారక రాముడి తాండవం ఇలా ఉంటే పర్ఫెక్ట్ టాక్ పడుంటే ఏ లెవెల్లో ఉండేదో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు