‘దేవర’ పేరిట సరికొత్త రికార్డు !

‘దేవర’ పేరిట సరికొత్త రికార్డు !

Published on Oct 13, 2024 9:29 PM IST

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘దేవర’ సినిమా మొత్తానికి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మాత్రం భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ సరికొత్త రికార్డును దేవర బ్రేక్ చేసింది. 16వ రోజు కలెక్షన్ల షేర్‌లో తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2 రూ.3.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండేది. ఆ రికార్డును తాజాగా ఎన్టీఆర్ ‘దేవర’ బ్రేక్ చేసింది. 16వ రోజున దేవర సినిమా రూ.3.65 కోట్లు వసూలు చేసింది.

ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లో హను-మాన్, ఆర్ఆర్ఆర్, ఎఫ్ 2 చిత్రాలు ఉన్నాయి. 16వ రోజున హను-మాన్ కి రూ.3.21కోట్లు వచ్చాయి, ఆర్ఆర్ఆర్ కి రూ.3.10కోట్లు వచ్చాయి. ఇక ఎఫ్ 2 విషయానికి వస్తే.. రూ.2.56 కోట్లు వచ్చాయి. మొత్తానికి 16వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లను సాధించిన సినిమాగా దేవర నిలవడం విశేషం. గత నెల 27న విడుదలైన ‘దేవర’ తాజాగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు