‘గుంటూరు కారం’ అని పెట్డడం తప్పు – నాగవంశీ

‘గుంటూరు కారం’ అని పెట్డడం తప్పు – నాగవంశీ

Published on Oct 14, 2024 10:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. భారీ అంచనాల నడుమ ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చినా.. ప్రీమియర్ షోల నుంచి మిక్డ్స్ టాక్ వచ్చింది. అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా నిర్మాత నాగవంశీ ‘గుంటూరు కారం’ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇంతకీ, నిర్మాత నాగవంశీ ఏం మాట్లాడారు అంటే.. ”గుంటూరు కారం’ సినిమా మాకు బాగా నచ్చింది. కంటెంట్ పరంగా ఆ మూవీలో ఎలాంటి తప్పూ లేదు. అలాగే, సినిమా కమర్షియల్‌గా కూడా బాగానే సక్సెస్ అయ్యింది. కానీ, ఒక్క నైజాంలోనే కలెక్షన్స్ పరంగా డ్యామేజ్ అయింది. ఆ మూవీకి ‘గుంటూరు కారం’ అని టైటిల్ పెట్డడం ఓ తప్పు అని నేను భావిస్తున్నా. ఫ్యామిలీ మూవీకి మాస్ టైటిల్ పెట్టడం, పైగా మిడ్ నైట్ 1 AM షో వేయడం కూడా తప్పు అయి ఉండొచ్చు’ అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు