మెగాస్టార్ క్లాప్ తో ‘నాగబంధం’ గ్రాండ్ లాంచ్

మెగాస్టార్ క్లాప్ తో ‘నాగబంధం’ గ్రాండ్ లాంచ్

Published on Oct 14, 2024 3:53 PM IST

‘పెదకాపు’ సినిమాతో సక్సెస్ ఫుల్ గా డెబ్యు చేసిన విరాట్ కర్ణ, తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ‘నాగబంధం’ చిత్రంలో విరాట్ కర్ణ లీడ్ రోల్ పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మించే పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన తర్వాత, తన అప్ కమింగ్ డైరెక్షనల్ వెంచర్ ‘నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్’ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 1 గా కిషోర్ అన్నపురెడ్డి ఈ మ్యాజిస్టిక్ ఎడ్వంచర్ ని నిర్మించనున్నారు. తారక్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు.

ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఈరోజు టీం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ముహూర్తం షాట్‌కి క్లాప్‌ కొట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌కి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఆసియన్‌ సునీల్‌ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు.

అభిషేక్ నామా డివైన్, అడ్వంచర్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాశారు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో నిధి, పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భండార్‌ను తెరిచిన తర్వాత గుప్త నిధుల అంశం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయి. సినిమా కథ భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలకు సంబంధించిన నాగబంధం చుట్టూ తిరుగుతుంది.

నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చిరంజీవి గారు ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అక్టోబర్లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మరో ఏడాదిన్నరలోనే సినిమాని ప్రేక్షకులను తీసుకొస్తున్నాము. ఎగ్జాక్ట్ డేట్ త్వరలోనే చెప్తాము. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం. అందరికీ థాంక్యూ’ అన్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు