గ్రాండ్‌గా ‘ది డీల్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

గ్రాండ్‌గా ‘ది డీల్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

Published on Oct 15, 2024 9:30 AM IST

‘ఈశ్వర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన హను కోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ”ది డీల్”. ఈ చిత్రాన్ని సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనితరావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. చందన, ధరణి ప్రియ హీరోయిన్స్ గా నటించారు. “ది డీల్ ” సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత బసిరెడ్డి మాట్లాడుతూ.. “ది డీల్” సినిమాను చూశాను. చాలా బాగుంది. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీతో మూవీ మొత్తం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విజయం సాధించి హనుకు, ఇతర టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ మూవీ టీమ్ నాకు చాలా దగ్గరి వాళ్లు. “ది డీల్” సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే ఆశిస్తున్నాను. నటీనటులు, టెక్నికల్ టీమ్ కష్టపడి వర్క్ చేశారు. సినిమా సక్సెస్ అయి అందరికీ మంచి గుర్తింపు తీసుకువస్తుందని ఆశిస్తున్నా.’ అని అన్నారు.

సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ మాట్లాడుతూ.. ‘ “ది డీల్” సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ హను ఎంతో క్లారిటీతో సాంగ్స్ చేయించుకున్నారు. పాటలు బాగా కుదిరాయి. “ది డీల్” మూవీలో మ్యూజిక్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు.’ అని అన్నారు.

హీరో, దర్శకుడు హను కోట్ల మాట్లాడుతూ.. ‘ఈ రోజు మమ్మల్ని బ్లెస్ చేసేందుకు వచ్చిన బసిరెడ్డి గారికి, మిర్యాల రవీందర్ రెడ్డి గారికి థ్యాంక్స్. హీరో, దర్శకుడు కావాలనేది నా కల. ఆ కలను నెరవేర్చుకునే క్రమంలో “ది డీల్” సినిమా రూపొందించి నటించాను. నాటకరంగంలో అనుభవం తెచ్చుకున్నాను. ఈటీవీ మాయాబజార్ సీరియల్ 150 ఎపిసోడ్స్ చేశాను. రిలయన్స్ కోసం, ఇతర ప్రముఖ కంపెనీలు, రేడియో కోసం ప్రోగ్రామ్స్ చేశాను. “ది డీల్” సినిమాతో దర్శకుడిగా, హీరోగా మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుంది. “ది డీల్” సినిమాను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు