‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ హీరో వస్తాడా రాడా..?

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ హీరో వస్తాడా రాడా..?

Published on Oct 15, 2024 1:17 PM IST

టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం ‘స్వయంభూ’ అనే పీరియాడిక్ మైథలాజికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నాడు. ‘కార్తికేయ-2’ తరువాత నిఖిల్ నుండి ఆ స్థాయిలో రాబోయే సినిమా ఇదే అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మధ్యలో నిఖిల్ నటించిన మరో సినిమా రిలీజ్‌కు రెడీ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమా నవంబర్ 8న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను కరోనా సమయంలో ప్రారంభించారు. అయితే, చాలా సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎలాగోలా పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ చేశారు మేకర్స్. ఇక ‘స్వయంభూ’పై అంచనాలు భారీగా ఏర్పడుతున్న తరుణంలో ఇలా ఎప్పుడో ప్రారంభమైన సినిమా రిలీజ్‌కి రావడంతో నిఖిల్ కాస్త నిరాశకు లోనవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ఇప్పుడు ఈ చిత్ర ప్రమోషన్స్‌కి నిఖిల్ వస్తాడా రాడా అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వాసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు