‘మ్యాజిక్’ చేస్తున్న ‘జెర్సీ’ డైరెక్టర్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

‘మ్యాజిక్’ చేస్తున్న ‘జెర్సీ’ డైరెక్టర్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Oct 16, 2024 2:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి చేస్తున్న యూత్‌ఫుల్ మూవీ ‘మ్యాజిక్’.

ఈ సినిమాలో అందాల భామ సారా అర్జున్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ‘మ్యాజిక్’ చిత్రాన్ని డిసెంబర్ 21న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక గౌతమ్ ఈ సినిమాతో పాటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ‘VD12’ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు