ఇకపై నో బ్రేక్ అంటోన్న ఎన్టీఆర్..?

ఇకపై నో బ్రేక్ అంటోన్న ఎన్టీఆర్..?

Published on Oct 16, 2024 8:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తరువాత కాస్త బ్రేక్ తీసుకుంటున్న ఎన్టీఆర్, తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే బాలీవుడ్ ప్రెస్టీజియస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్-2’లో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తరువాత ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నాడు. ఇక నవంబర్ నుండి ఎన్టీఆర్ ‘వార్-2’ షూటింగ్‌లో జాయిన్ అవుతున్నాడు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకుని నీల్ మూవీలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు.

అటు ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్‌లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ లేని సీన్స్‌కి సంబంధించిన షూట్ జరపుకునేందుకు ఆయన రెడీ అవుతున్నాడు. ఆ తరువాత తారక్ కూడా మూవీ షూటింగ్‌లో జాయిన్ కానుండటంతో, ఎలాంటి బ్రేక్ లేకుండా తారక్ తన నెక్స్ట్ రెండు సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు