ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన ‘మెకానిక్ రాకీ’

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన ‘మెకానిక్ రాకీ’

Published on Oct 16, 2024 9:09 PM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక దీపావళి బరిలో నుండి తప్పుకున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 22న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 20న మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రజినీ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు