Pushpa 2: ‘పుష్ప-2’ షూటింగ్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన బ్రహ్మాజీ

Pushpa 2: ‘పుష్ప-2’ షూటింగ్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన బ్రహ్మాజీ

Published on Oct 17, 2024 9:02 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేస్తుండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తనదైన మార్క్‌తో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల చివరి షెడ్యూల్ షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయ్యిందని నటుడు బ్రహ్మాజీ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. బ్రహ్మాజీ ‘పుష్ప-2’ సినిమాలో సబ్-ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ‘పుష్ప-2’ సెట్స్‌లోని కొన్ని ఫోటోలను ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశాడు. అంతేగాక, ‘పుష్ప-2’ షూటింగ్ పూర్తి అంటూ కామెంట్ చేశాడు. దీంతో ‘పుష్ప-2’ షూటింగ్ ముగిసిందని తేలిపోయింది.

ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. డిసెంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు