ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సీక్వెల్ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
అయితే, ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా 50 రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇదే విషయాన్ని తాజాగా ఓ కొత్త పోస్టర్ ద్వారా తెలియజేశారు. పుష్ప రాజ్ సీరియస్ మోడ్‌లో కూర్చున్న పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో పుష్పరాజ్ బ్రాండ్ మార్క్ అయిన చేతి గుర్తు మనకు కనిపిస్తుంది. ఇలా ఈ సరికొత్త పోస్టర్ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి.
ఇక ఈ సినిమాలో తన నటనతో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ ఊచకోతకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి 50 రోజుల్లో రానున్న ఈ ‘పుష్ప-2’ తుఫాను ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.