‘వేట్టయన్’కి ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్

‘వేట్టయన్’కి ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్

Published on Oct 17, 2024 4:00 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్: ది హంటర్’ దసరా సందర్భంగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ డైరెక్ట్ చేయగా యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ‘వేట్టయన్’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందేమో అని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తుంటే, దర్శకుడు జ్ఞానవేల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

‘వేట్టయన్’ సినిమాలో సెటిల్డ్ పాత్రలను చూపెట్టారు. అయితే, ఇప్పుడు దర్శకుడు వేట్టయన్ చిత్రానికి ప్రీక్వెల్ కథను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అసలు హీరో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఎలా అయ్యారు.. ప్యా్ట్రిక్ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా ఎలా మారాడు.. దీనికి సంబంధించిన కథను ఎంగేజింగ్‌గా చూపెట్టాలని ఆయన అనుకుంటున్నాడట. దీంతో త్వరలోనే వేట్టయన్ చిత్రానికి ప్రీక్వెల్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అభిమానులు అంటున్నారు.

ఇక వేట్టయన్ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, ఫహాద్ ఫాజిల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు