ప్రస్తుతం సౌత్ లో ఉన్న టాప్ మోస్ట్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుల్లో కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. మరి లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమాలు మాస్ అండ్ యాక్షన్ మూవీ లవర్స్ ని ఓ రేంజ్ లో అలరించగా తన లైనప్ పై ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఇప్పుడు ఉన్నాయి. అయితే లోకేష్ నుంచి ప్రస్తుతం కూలీ, విక్రమ్ 2, రోలెక్స్, ఖైదీ 2, లియో 2 ఇలా తన సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్నవి లేనివి కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి.
అయితే ఈ లైనప్ లో మరో ఇంట్రెస్టింగ్ కలయిక కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అది కూడా యంగ్ హీరో శివ కార్తికేయన్ తో అట. తన దగ్గర ఆల్రెడీ శివ కార్తికేయన్ కోసం ఓ మంచి స్క్రిప్ట్ సిద్ధం గానే ఉందని తమ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడైనా మొదలు కావచ్చని తెలుస్తుంది. దీనితో లోకేష్ నుంచి భవిష్యత్తులో కొన్నేళ్ల వరకు నాన్ స్టాప్ సినిమాలు రానున్నాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేస్తున్న “కూలీ” షూట్ లో తాను బిజీగా ఉన్నాడు.