ప్రస్తుతం ప్రపంచ సినిమా అంతా కూడా మన ఇండియన్ సినిమా నుంచి వస్తున్నా సినిమాల కోసం ఆసక్తిగా చూస్తున్న సంగతి తెలిసిందే. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి సినిమాల పుణ్యమాని ప్రపంచ దేశాల్లో మరింత స్థాయిలో మన తెలుగు సినిమాలు సహా ఇతర భాషలు సినిమాలు విస్తరిస్తున్నాయి. అయితే పలు దేశాల్లో మన సినిమాలు విడుదల అవుతూ వస్తున్నా సంగతి తెలిసిందే.
అలా కామన్ గా యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అలాగే జపాన్ వంటి దేశాల్లో విడుదల అవుతున్నాయి. అయితే ఈ దేశాలతో పాటుగా రష్యా దేశంలో కూడా పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా రష్యా దేశ ప్రెసిడెంట్ వ్లడిమిర్ పుతిన్ ఇండియన్ సినిమా కోసం చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తాము తమ దేశంలో భారతీయ సినిమాలని ఆహ్వానిస్తున్నామని అలాగే ఇక్కడ ఇండియన్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ పై కూడా త్వరలోనే చర్చలు జరుపుతామని అయన తెలిపారు. దీనితో భారతీయ సినిమాల విషయంలో ఓ దేశ ప్రెసిడెంట్ ఇలా ఆసక్తి చూపించడం అనేది మూవీ లవర్స్ కి సహా ఇండియన్ సినిమాకి గర్వకారణంగా నిలిచిందని చెప్పాలి.
We will find common ground to promote Indian films to Russian market – Putin pic.twitter.com/Sp2rYtAhZZ
— RT (@RT_com) October 19, 2024