‘మాయా లోకం’ ర్యాప్ పై చోటా కే నాయుడు ప్రశంసలు

‘మాయా లోకం’ ర్యాప్ పై చోటా కే నాయుడు ప్రశంసలు

Published on Oct 19, 2024 10:11 AM IST


సినిమాల పరంగానే కాకుండా ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మంది కేవలం సాంగ్స్ ని కూడా వినేవారు ఉంటారు. అలా ఎన్నో ప్రైవేట్ హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. మరి అలాంటో ఓ స్పెషల్ ర్యాప్ సాంగ్ ని అయితే స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా. కె.నాయుడు రిలీజ్ చేశారు. “మాయాలోకం” అనే ర్యాప్ వీడియో ఆల్బమ్ విడుదల చేసి, ఆల్బమ్ బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. “మాయాలోకం” విజువల్స్ మెస్మరైజింగ్ గా ఉన్నాయని మెచ్చుకున్నారు.

‘మిస్టర్ రాకి’ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉందని కితాబునిచ్చారు. ఈ ఆల్బమ్ కు యువ ప్రతిభాశాలి మిస్టర్ రాకి లిరిక్స్ అండ్ ర్యాప్ సమకూర్చగా జె.హెచ్.ఎల్.టి నిర్మించారు. “మాయాలోకం” ర్యాప్ వీడియో ఆల్బమ్ ను లాంచ్ చేసిన చోటా. కె.నాయుడుకు ఆల్బమ్ రూపకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.

మరి ఈ సాంగ్ కి స్వాతి – విజ్జు ముదిరాజ్ లు కాన్సెప్ట్ అందించగా ఈ వీడియో ఆల్బమ్ కు అసిస్టెంట్ కెమెరామెన్: మాదాసు డేనియల్, హెయిర్ అండ్ మేకప్: బగ్స్ బన్నీ, కాస్ట్యూమ్స్: మిస్టర్ రాకి, పోస్టర్స్: మధుకర్ పడాల, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మ్యూజిక్ – మిక్సింగ్ & మాస్టరింగ్: మార్క్ ప్రశాంత్ మ్యూజికల్, డి.వొ. పి: ఫల్గుణ బెజవాడ, ఎడిటింగ్ & డి.ఐ: శశి కుమార్ చిట్లూరి, లిరిక్స్ & ర్యాప్: మిస్టర్ రాకి, నిర్మాణం: జె.హెచ్.ఎల్.టి లుగా పని చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు