టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసే హీరోగా శ్రీ విష్ణు తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్నాడు. ఇక హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీవిష్ణు సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘స్వాగ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఇక ఈ సినిమా తరువాత ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు శ్రీ విష్ణు రెడీ అవుతున్నాడట. బెల్లంకొండ గణేశ్‌తో ‘స్వాతిముత్యం’ వంటి సినిమాను తెరకెక్కించిన లక్ష్మణ్ కృష్ణ శ్రీవిష్ణుకి ఓ కథ చెప్పాడట. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని తెలుస్తోంది. దీంతో ఈ కథకు శ్రీవిష్ణు గ్రీన్ సిగ్లన్ ఇచ్చాడని.. త్వరలోనే ఈ సినిమా కథను పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాను కూడా గతంలో వచ్చిన ‘సామజవరగమనా’ చిత్రం మాదిరిగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.