గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అయితే రెండో సాంగ్ గా వచ్చిన మాస్ సాంగ్ రా మచ్చా మచ్చా అయితే స్టార్ట్ అవ్వడమే చార్ట్ బస్టర్ గా మొదలైంది.
ఇక నెక్స్ట్ గ్లోబల్ రీచ్ ని కూడా సొంతం చేసుకుంది. అయితే మొదట జపాన్ ఆడియెన్స్ లో వైరల్ గా మారిన ఈ సాంగ్ ఇప్పుడు సౌత్ కొరియన్ ఆడియెన్స్ ని ఊపేస్తోంది. మరి కొరియాకి చెందిన ప్రముఖ పాప్ సింగర్ పార్క్ మిన్ జున్ అనే సింగర్ తన టీం తో కలిసి రా మచ్చా మచ్చా సాంగ్ హుక్ స్టెప్ ని వేశారు. దీనితో ఈ క్లిప్ సోషల్ మీడియాలో చరణ్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. మొత్తానికి అయితే థమన్ ఇచ్చిన సాంగ్ భారీ హిట్ అయ్యింది అని చెప్పాలి.
South Korean Singer Park Min-jun (Popularly known as AOORA) and his mates grooving for #RaaMachaMacha ????#GameChanger @AlwaysRamCharan @MusicThaman @shankarshanmugh pic.twitter.com/HCCzQmdu5E
— RamCharan ERA™ ???? (@TeamCharanERA) October 20, 2024